బీజేపీ చేస్తున్న కుట్ర ప్రమాదకరమైంది

బీజేపీ చేస్తున్న కుట్ర ప్రమాదకరమైందన్నారు కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడుగు బలహీనవర్గాల ప్రజలను అణగతొక్కాలనే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపించారు. మేము కూడా భారతీయులమే అని జాతీయ జెండా పట్టుకుని చెప్పాల్సిన పరిస్థితి ఈ దేశంలో ఉందన్నారు. SC,ST బడుగు బలహీన వర్గాల ప్రజలు  ఆందోళన చెందే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో మైనారిటీలు మా బ్రతుకు ఏంటి అంటూ రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేసే పరిస్థితులు ఎందుకు వచ్చాయంటూ MIM అధినేత అసదుద్దీన్ ఒవైసీనీ ప్రశ్నించారు. అంతేకాదు మీరు నిజంగా మైనారిటీల క్షేమం కోరేవారు అయితే.. చిత్తశుద్ధి ఉంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకి వ్యతిరేకంగా పోరాటం చేద్దాము రండి .. అంటూ కోరారు. ఇలాంటి పరిస్థితి రావడానికి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేక పోవడమే కారణమన్నారు. తిరిగి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకుచ్చేందుకు కృషి చేద్దామన్నారు భట్టి.

Latest Updates