‘పోలీసులు కండువా లేని టీఆర్ఎస్ నాయకులు‘

పోలీసులు కండువా లేని టీఆర్ఎస్ నాయకులుగా మారారన్నారు బీజేపీ కోర్ కమిటీ సభ్యులు వివేక్ వెంకటస్వామి. ఎమ్మెల్యేల కబ్జాలు, ఇసుక మాఫియాలకు సహకరిస్తున్నారన్నారు. బీజేపీ నాయకులపై తప్పుడు కేసులు పెడుతున్నారన్నారు. కేసీఆర్ మెడలు వంచి ఎల్ఆర్ఎస్ ను రద్దు చేయించిన ఘనత బీజేపీదేనన్నారు. కాక వెంకటస్వామి వైఎస్ రాజశేఖర్ రెడ్డితో కొట్లాడి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును తీసుకొస్తే.. కేసిఆర్ కమీషన్ల కోసం రీ డిజైనింగ్ పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారన్నారు.  రూ. 25వేల కోట్ల తోపూర్తయ్యే ప్రాజెక్టును లక్ష కోట్లకు పెంచడమే గాకుండా.. అదనంగా మూడో టీఎంసీ పేరుతో మరో రూ. 25 వేల కోట్లకు పెంచారన్నారు.  కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులకు పదవులు ఇవ్వడం తప్ప నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం లేదన్నారు. యోగీ ఆదిత్యనాథ్ యూపీలో 35 లక్షల ఇండ్లు, ఫడ్నవీస్ మహారాష్ట్రలో 25 లక్షల ఇండ్లు పేదవాళ్లకు కట్టించారని.. తెలంగాణలో కేసీఆర్ ఎన్ని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టారని ప్రశ్నించారు. భారత్ ఆయుష్మాన్ తెలంగాణలో అమలు చేసి వుంటే కరోనా పేషెంట్లకు ఎంతో ఉపయోగంగా ఉండేదన్నారు. ప్రధాని ఆవాస యోజన, కిసాన్ నిధి ద్వారా వేలాది మందికి ఎంతో లబ్ది చేకూరుతుందన్నారు.

see more news

భారత్ సంచలన విజయం.. కంగారూలను చితగ్గొట్టిన పంత్, గిల్

టీమిండియాకు రూ.5 కోట్ల భారీ నజరానా

తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్

సీఎం కేసీఆర్ టూర్.. 8 గ్రామాల్లో పవర్ నిలిపివేత

అందుకే కేసీఆర్ ను మోడీ కాపాడుతున్నాడు

 

Latest Updates