ప్రగతిభవన్ వద్ద ఉద్రిక్తత.. బీజేపీ కార్పొరేటర్లు అరెస్ట్

హైదరాబాద్: సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది.  నూతన పాలక మండలిని వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ.. బీజేపీ కార్పోరేటర్లు ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో పోలీసులకి , కార్పొరేటర్లకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. వెంటనే జీహెచ్ఎంసీ కొత్త కౌన్సిల్ ఏర్పాటు చేయాలని, సర్కార్ కావాలనే కౌన్సిల్ ఏర్పాటు చేయటం లేదని ఆరోపించారు కార్పోరేటర్లు. తాము గెలిచి నెల రోజులు అవుతున్నా కూడా తమకి ఎలాంటి గుర్తింపు లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజలు ఎన్నుకుంటే , ప్రజాస్వామ్య పద్దతిలో గెలిచామని.. ప్రజలకి ఏం సమాధానం చెప్పాలంటూ మండిపడ్డారు. ప్రగతి భవన్ ముట్టడికి యత్నించిన బీజేపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో తమను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు , తాము ఏమైనా రౌడీలమా అంటూ ప్రశ్నించారు. కేసీఆర్, కేటీఆర్ డౌన్ డౌన్ అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Latest Updates