కేసీఆర్ బిడ్డ కవిత నే బీజేపీ ఓడించింది.. దుబ్బాక లో ఓడించలేమా?

దుబ్బాక: నిజామాబాద్ లో  సీఎం కేసీఆర్ బిడ్డ కవితను బీజేపీ ఓడించింది కదా.. మరి దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిని ఓడించలేమా  అని దుబ్బాక బీజేపీ అభ్యర్థి ఘునందన్ రావు ప్రశ్నించారు. ఏటి గడ్డ కిష్టాపూర్ లో  ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన అధికార టీఆర్ఎస్ పార్టీ నేతల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఏటి గడ్డ కిస్టాపూర్ ను కేసీఆర్ ప్రభుత్వం మల్లన్న సాగర్ లో ముంచుతోందని ఆరోపించారు. పోలీసుల తో మల్లన్న సాగర్ ముంపు ప్రాంతాల ప్రజలను ఏడిపించారు.. మనం ఏడ్చుకుంటూ ఏమి చేయలేకపోయినా  పైన ఉన్న మల్లన్న దేవుడు చూసిండు.. కాబట్టే దుబ్బాక  ఉప ఎన్నిక వచ్చిందన్నారు. మల్లన్న సాగర్ ముంపు ప్రాంతాల్లో రైతులకు  ప్రతి ఎకరాకు రూ.15 లక్షలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. నన్ను గెలిపించండి..

ఆరు నెలల్లో మీ సమస్యలు పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తా.. మీ సమస్యలు పరిష్కరించే వరకు ఎవరూ మీ ఇండ్లు ఖాళీ చేయొద్దని ఆయన కోరారు. మంత్రి హరీష్ రావు కు అహంకారం ఎక్కువైంది.. ఆయన మెడలు వంచాలి..  హరీష్ అహంకారం తగ్గాలంటే ఓటు బిజెపి కి వేయాలని రఘునందన్ రావు పిలుపునిచ్చారు.

for more News…

 

Latest Updates