సెప్టెంబర్ 17న అధికారికంగా జరపాలి.. ఢిల్లీలో బీజేపీ డిమాండ్

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని డిమాండ్ చేశారు బీజేపీ నేతలు. ఢిల్లీలోని కానిస్టిట్యూషన్ క్లబ్ లో ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. తెలంగాణ విమోచన ఉద్యమానికి సంబంధించిన చారిత్రక ఘట్టాల ఫొటోలను ప్రదర్శించారు. ఈ ఎగ్జిబిషన్ ను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు, బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు లక్ష్మణ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిజాం వ్యతిరేక ఉద్యమకారులకు నివాళి అర్పించారు.

వల్లభాయ్ పటేల్ కృషి, ముందుచూపుతోనే దేశంలో తెలంగాణ విలీనం అయిందన్నారు నాయకులు. తెలంగాణలో నిజాం నియంతృత్వంలాగే.. సీఎం కేసీఆర్ పాలన ఉందని విమర్శించారు నేతలు.

Latest Updates