RBI విడుదల చేసిన ఆర్ధిక నేరగాళ్ల లిస్టులో బీజేపీ సన్నిహితులు: రాహుల్

భారత బ్యాంకులను, ఇతర ఆర్థిక సంస్థలను మోసం చేసి.. అప్పులు ఎగ్గొట్టిన 50 మంది లిస్టును జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI ) విడుదల చేసింది. దీనిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. ఈ లిస్టులో బీజేపీకి సన్నిహితులైన వారి పేర్లు కూడా ఉన్నాయని…అందుకే పార్లమెంటులో ఈ జాబితాను ప్రకటించేందుకు బీజేపీ వెనక్కి తగ్గిందని ఆరోపించారు రాహుల్.

ఈ విషయమై ఇప్పటికే పార్లమెంటులో  ప్రశ్నించినట్లు రాహుల్ తెలిపారు.  50 మంది అతిపెద్ద ఆర్థిక నేరగాళ్ల పేర్లు చెప్పమన్నానని… ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అందుకు నిరాకరించారన్నారు. ఆర్బీఐ నీరవ్ మోడీ, చోక్సీ తో పాటు మరికొందరు బీజేపీ సన్నిహితుల పేర్లను జాబితాలో చేర్చిందన్నారు. బీజేపీ  ఆర్బీఐ విడుదల చేసిన వివరాలను పార్లమెంటులో ఎందుకు ప్రకటించలేదో ఇప్పుడు అర్ధమైందన్నారు రాహుల్ గాంధీ.

Latest Updates