గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీదే ఆధిపత్యం

గుజరాత్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజార్టీ సాధించింది. ప్రధాని మోడీ, హొం మంత్రి అమిత్‌ షా స్వరాష్ట్రం గుజరాత్‌లో అన్ని మున్సిపల్‌ కార్పొరేషన్లలోనూ భారీ విజయం సాధించింది. రాష్ట్రంలోని ఆరు కార్పొరేషన్లలో మొత్తం 576 డివిజన్లలో ఆదివారం ఎన్నికలు జరగ్గా.. ఈ రోజు ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఈ ఎన్నికల్లో 576 డివిజన్లకు గాను బీజేపీ 466 ప్రాంతాల్లో విజయం సాధించింది. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. కేవలం 45 స్థానాలకే పరిమితమైంది.

గుజరాత్ లో మొత్తం 6 కార్పొరేషన్లను బీజేపీ గెలుచుకుందని తెలిపారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. ప్రధాని మోడీ కూడా గుజరాత్ మున్సిపల్ ఎన్నికలపై స్పందించారు. బీజేపీకి పట్టం కట్టారంటూ గుజరాత్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు మరోసారి సుపరిపాలనకు మద్దతు ఇచ్చారని తెలిపారు.

Latest Updates