కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ ప్రధానిలా మాట్లాడుతుంది

కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ ప్రధానిలా మాట్లాడుతుందని అన్నారు  బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు. సీఏఏపై ముస్లింలలో అనవసర భయాలు కాంగ్రెస్ పార్టీ కలుగచేస్తుందని ఆయన చెప్పారు. ప్రజాస్వామ్యానికి అనుగుణంగానే కేంద్రం పౌరసత్వ బిల్లును ఆమోదించిందని చెప్పారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్ దేశాలలోని మైనారిటీలు ఎప్పుడు కావాలన్నా రక్షణ కల్పించాల్సిన బాధ్యత భారతదేశంపై ఉందని మహాత్మాగాంధీ తెలిపారని గుర్తుచేశారు. భారతదేశంలో ముస్లింలకు భద్రత ఉందని… అందుకు నిదర్శనమే… దేశంలోని ముస్లింజనాభా 2.5 కోట్ల నుంచి 17కోట్లకు పెరగడమే అని చెప్పారు. అయితే కాంగ్రెస్ కమ్యునిస్టులు మాత్రం ఇందుకు విరుద్ధంగా ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు.

Latest Updates