తెలంగాణలో తర్వాత ప్రభుత్వం బీజేపీదే : చౌహాన్

2023 ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తుందన్నారు మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్. బీజేపీలో కుటుంబ రాజకీయాలు, కుల రాజకీయాలకు ఆవకాశం లేదన్నారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. తెలంగాణ, బెంగాల్ లో బీజేపీ సీట్లు సాదించడం అత్యంత ఆనందకరమైన విషయని… బీజేపీకి మద్దతు పలికినందుకు తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

జూలై 7న పార్టీత సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రధాని మోడీ ప్రారంభిస్తారన్న చౌహాన్… ఆగస్ట్ 11 వరకు సభ్యత్వ నమోదు క్యాంపెనింగ్ ఉంటుందన్నారు. బీజేపీ సభ్యులైనా, కాకున్నా వారి అభివృద్ధికి తోడ్పడుతామని స్పష్టం చేశారు.

నీతి ఆయోగ్ కార్యక్రమాలకు రాని సీఎం కేసీఆర్ కు…తెలంగాణ అభివృద్ధిపై అసలు ధ్యాసే లేదన్నారు. కేంద్రం అమలు పరుస్తున్న అనేక పథకాలు ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని ఆరోపించారు. తెలంగాణలో అగ్రవర్ణాల రిజర్వేషన్లు అమలు పరచడం లేదన్నారు. ఇక కాంగ్రెస్ అధ్యక్షులుగా ఎవరు ఉంటారో వారికే క్లారిటీ లేదన్నారు చౌహాన్. బీజేపీ లోకి ఎవరు వచ్చినా స్వాగతం పలుకుతామని స్పష్టం చేశారు. మధ్యప్రదేశ్ సచివాలయం అక్రమార్కుల అడ్డాగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Latest Updates