రెండు చోట్ల ఓటేశారంటూ ఎమ్మెల్సీ కవితపై ఈసీకి ఫిర్యాదు

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్సీ కవిత రెండు చోట్ల ఓటు కలిగి ఉన్నారని సీఈసీకి బీజేపీ ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి లేఖ రాశారు. ఎమ్మెల్సీ కవితపై అనర్హత వేటు వేయాలని లేఖలో కోరారు. బోధన్ అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు.. హైదరాబాద్‌లో కవితకు ఓటు హక్కు ఉందన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో కవిత ఓటు వినియోగించుకున్నారని ఎస్ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. కవితను డిస్‌ క్వాలిఫై చేయాలని ఈసీని కోరారు.

Latest Updates