సంఘ్ ఎజెండా ను అమలు చేస్తారా?

లక్నో : కరోనా నివారణకు దేశమంతా ఒక్కటై పోరాటం చేస్తుంటే బీజేపీ మాత్రం అందుకు విరుద్ధంగా రాజకీయాలు చేస్తోందని సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా విమర్శించారు. సంఘ్ ఎజెండాను అమలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని విమర్శించారు. ప్రధాని మోడీ ఆగ్రా మోడల్ అంటూ తన ప్రసంగంలో ప్రస్తావించటంపై కూడా అఖిలేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఇక్కడ లాక్ డౌన్ సరిగా అమలు కావటం లేదని, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహారిస్తూ హెల్త్ సిస్టమ్ నే దెబ్బ తీశారని చెప్పారు. నిత్యావసరాలను కూడా ప్రజలకు అందించలేకపోతుంటే ప్రధాని ఆగ్రా మోడల్ అంటూ ఎలా ప్రశంసిస్తారన్ని నిలదీశారు. అటు ఆర్ఎస్సెస్ పై కూడా ఫైర్ అయ్యారు. లాక్‌డౌన్ సమయంలో వివిధ స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ వర్గాలు పంపిణీ చేసిన ఆహార పదార్థాలను తమవిగా చెప్పుకుంటూ దిగజారి వ్యవహారిస్తు్న్నారన్నారు. ఇలాంటి సంఘటనలు వారి మనస్తాత్వాన్ని సూచిస్తున్నాయన్నారు.

Latest Updates