తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం

bjp-in-telangana-is-coming-to-power-says-dk-aruna

అమిత్ షా తెలంగాణ లో బీజేపీ సభ్యత్వం ప్రారంభించారు అంటే… తెలంగాణ లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు మాజీ మంత్రి, బీజేపీ నేత డికే అరుణ. పార్లమెంటు ఎన్నికలతో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేది కాదన్నారు. హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేయడంలో కేసీఆర్ కు మంచి నైపుణ్యం ఉందని ఆరోపించారు. ఇప్పటివరకు రైతులకు 50% రైతు బంధు అందలేదన్నారు. నాలుగు పార్లమెంటు స్థానాల్లో బీజేపీని గెలిపించిన ప్రజలు.. కేసీఆర్ కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారన్నారు. ఎన్నికల సమయంలో రెండు వేల పెన్షన్ ఇస్తామని ఇంతవరకు ఇవ్వడం లేదన్నారు. అమలు చేయని పథకాలు పెట్టి అమాయక ప్రజలను మోసం చేసి టీఆర్ఎస్ గద్దెనెక్కిందన్నారు. రాష్ట్రం అప్పులపాలైతే…కేసీఆర్ కుటుంబం మాత్రం బంగారమైందని ఆరోపించారు.

టీఆర్ఎస్ ఉద్యమం కరీంనగర్ లో పుట్టిందని పలికిన కేసీఆర్ కు..అక్కడి ప్రజలు పార్లమెంటు ఎన్నికల్లో ఓడించారన్నారు. నిజామాబాద్ ప్రజలు ఆయన కూతురు కవితమ్మను ఓడించారన్నారు. ఇక రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ పథనం అయినట్టేనన్నారు డీకే అరుణ.

Latest Updates