బొట్టుబిళ్లల ప్యాకెట్లపై ప్రధాని మోడీ

ఎన్నికల ప్రచారం కోసం అందుబాటులో ఉన్న ప్రతీ వస్తువును ఉపయోగించుకుంటున్నారు రాజకీయ నాయకులు. త్వరలో లోక్ సభ ఎన్నికలు జరగనుండటంతో ఆయా పార్టీల నేతలు ప్రచారంలో బిజీ అయ్యారు. దీంతో పాటు అవకాశం ఉన్న ప్రతీ అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఇందులో భాగంగా నేను మీ చౌకీదార్ అంటూ ప్రచారం చేస్తున్న మన ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ పార్టీ నాయకులు ఇప్పటికే రైళ్ళలో టీ కప్పులపై మైబీ చౌకీదార్ అనే నినాదంతో ప్రచారం చేయడం, మాపెళ్లికి మీరు గిఫ్టులు ఇవ్వొద్దు కానీ మోడీకి ఓటేయ్యండని పెళ్లి కార్డుల మీద ముద్రించడం చేపట్టారు. ఇప్పుడు బొట్టు బిళ్లల ప్యాకెట్ పై మోడీ బొమ్మ, కమలం గుర్తు, హిందీలో ఫిర్సే మోడీ సర్కార్ అనే నినాదాలు ఉన్న .. ఈ ఫోటోలు నిజంగా కంపెనీ ముద్రించిందా లేక ఇంకెవరైనా అనధికార వ్యక్తులెవరైనా ముద్రించారా అన్నది తెలియదు. కానీ పరాస్ ఫ్యాన్సీ బిందీ అనే కంపెనీ విడుదల చేసింది. మోడీ ఉన్న బొట్టు బిళ్ళల ఫోటోలను పశ్చమ బెంగాల్ రాయ్ గంజ్ నియోజకవర్గ ఎంపీ సలీం ట్విట్టర్ లో పోస్టు చేశారు.

 

Latest Updates