కాంగ్రెస్ సముద్రం.. మజ్లిస్ మూసీ

హైదరాబాద్‌‌, వెలుగు: ఎంఐఎం పార్టీ మూసినది లాంటిది.. సముద్రం లాంటి కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేసి ఉనికి చాటుకోవలనుకుంటోందని కాంగ్రెస్‌‌ రాజ్యసభ ఎంపీ సయ్యద్ నాసిర్ హుసేన్ విమర్శించారు. మంగళవారం గాంధీభవన్‌‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎంఐఎం లాంటి చిన్న పార్టీల నేతలు వార్తల్లో ఉండటానికి ఎప్పుడు ఏవో కామెంట్లు చేస్తారని ఎద్దేవా చేశారు. వారు చేసే బిలో డిగ్నిటీ, చీప్ కామెంట్లపై తాను స్పందించనని స్పష్టం చేశారు. ఎంఐఎం ఎవరి కనుసన్నల్లో పని చేస్తుందో ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. దేశంలో ఉద్యోగకల్పన, కొత్త పరిశ్రమలు లేవని.. వీటిపై నుంచి ప్రజల దృష్టి మళ్లీంచేందుకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రిజర్వేషన్లు, ఎన్పీసీ, ఎన్నార్పీ అంశాలను తెరపైకి తెస్తోందని ఆరోపించారు. మోడీ సర్కార్‌‌పాలన, నిర్ణయాలు దేశాభివృద్ధిని వెనక్కు నెట్టేలా ఉన్నాయని ఆరోపించారు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా తెచ్చిన బిల్లును కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందన్నారు. ఉభయసభల్లోనూ కాంగ్రెస్‌‌వాటిపై పోరాడుతుందన్నారు.

 

Latest Updates