GHMC ఫలితాలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. టీఆర్ఎస్ మంత్రి కేటీఆర్ తప్పుడు ఆరోపణలకు ప్రజలే సమాధానం చెప్పారన్నారు. ప్రజలు ఇచ్చిన సవాల్‌ను TRS ప్రభుత్వం స్వీకరించాలని అన్నారు. టీఆర్ఎస్ ప్రజల ఆదరణను వేగంగా కోల్పోతుందని విమర్శించారు. తెలంగాణ ప్రజలకు బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయమని స్పష్టం చేశారు. 2023లో అధికారానికి రావడానికి గ్రేటర్ ఎన్నికలు ప్లాట్ ఫామ్‌గా నిలిచిందన్నారు.
కూలిపోతున్న TRS పార్టీలోకి తమ కార్పోరేటర్లు వెళ్లరని స్పష్టం చేశారు కిషన్ రెడ్డి. అంతేకాదు పూర్తి ఫలితాలు వచ్చాక హంగ్‌పై స్పందిస్తామన్నారు. TRS పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపించారు. బీజేపీపై టీఆర్ఎస్ చేసిన తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మలేదని అన్నారు. అక్రమ కేసులు పెట్టినా.. బీజేపీ కార్యకర్తలు వెనకడుగు వేయలేదన్నారు కిషన్ రెడ్డి.