కేసీఆర్ ది ఫ్యామిలీ ఫ్రంట్: లక్ష్మణ్

హైదరాబాద్, వెలుగు: కేసీఆర్ ది ఫెడరల్ ఫ్రంట్ కాదు ఫ్యామి లీ ఫ్రంట్ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. కేసీఆర్ ఫ్రంట్ లో ప్రధాని అభ్యర్థి ఎవరో ముందు ప్రకటించాలని డిమాండ్ చేశారు. మోడీ కంటే కేసీఆర్ పెద్ద హిందు వో కాదు తనకు తెలియదు కాని, ఓవైసీ సోదరుల కంటే పెద్ద ముస్లిం అని మండిపడ్డారు. సికింద్రాబాద్ నుం చి లోక్ సభ బరిలో ఉన్న కిషన్ రెడ్డి కూడా కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. మోడీకి ఫామ్ హౌస్, రెస్ట్ హౌస్, విదేశాల్లో రిక్రియేషన్ క్లబ్స్ లేవంటూ కేసీఆర్ పై ఆరోపణాస్త్రాలు సంధించారు.

ఐదేళ్లలో ప్రధాని అసలు సెలవే తీసుకోలేదంటూ పరోక్షంగా కేసీఆర్ ను విమర్శించారు. హైదరాబాద్ లో నిర్వహించిన ‘నేను కూడా కాపలాదారు’ కార్యక్రమంలో కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 2008లో ముంబై తాజ్ హోటల్ పై తీవ్రవాదులు దాడి చేసి మారణహోం సృష్టిస్తే కాంగ్రెస్ ఎందుకు పాకిస్తాన్ పై ధీటుగా స్ప దించలేదని ప్రశ్నించారు.

Latest Updates