పిచ్చికుక్కల్ని కొట్టినట్లు కొట్టిస్తా..TMC కార్యకర్తలకు భారతీ ఘోష్ వార్నింగ్

కోల్ కతా: ‘ఇళ్లలోంచి బయటికి లాక్కొచ్చి పిచ్చికుక్కలను కొట్టినట్లు కొట్టిస్తా.. ఉత్తర ప్రదేశ్ నుంచి వెయ్యి మందిని పిలిపిస్తా’ అంటూ టీఎంసీ కార్యకర్తలను బీజేపీ ఘతాల్ అసెంబ్లీ అభ్యర్థి భారతీ ఘోష్ హెచ్చరించారు. అప్పుడు ఇళ్లకు తాళాలు వేసుకొని పారిపోవాల్సి ఉంటుందన్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఆదివారం నెట్టింట్లో వైరల్ గామారింది. ఇద్దరు టీఎంసీ కార్యకర్తలను ఉద్దేశించిభారతి ఈ హెచ్చరి కలు చేయడం వీడియోలో కని-పిస్తోంది. మాజీ ఐపీఎస్ ఆఫీసర్ అయిన భారతి ఈస్థాయి లో కామెంట్స్​చేయడానికి కారణం బీజేపీకార్యకర్తలను టీఎంసీ నేతలు బెదిరించడమేననితెలుస్తోంది. ఆనంద్ పూర్ ప్రాంతంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన భారతీ ఘోష్.. టీఎంసీ కార్యకర్తల దాడిలో గాయపడిన బీజేపీ కార్యకర్తలను పరామర్శించారు. ఈ సందర్భంగా ఈ నెల 12న జరిగే పోలింగ్ కు దూరంగా ఉండాలంటూ టీఎంసీ కార్యకర్తలు బెదిరిస్తున్నారని స్థానికులు ఆమెకుచెప్పారు. దీంతో మా కార్యకర్తలను బెదిరిస్తారా అంటూ భారతి మండిపడ్డారు. ఓటేస్తే కొడతారా..కొట్టండి. మా కార్యకర్తలకు ఇచ్చిందానికి రెట్టింపు మీకు ఇస్తానని వార్నింగ్ ఇచ్చారు.యూ

 

Latest Updates