నిరసన: రోడ్లపై వరినాట్లు నాటిన డీకే అరుణ

జోగులాంబ గద్వాల జిల్లాకేంద్రంలో పాడైన రోడ్లపై మాజీ మంత్రి డీకే అరుణ వినూత్నంగా నిరసన చేపట్టారు. స్థానిక రెండో రైల్వే గేటు సమీపంలోని రోడ్లపై బీజేపీ కార్యకర్తలతో కలిసి వరినాట్లు వేశారు. తన హయాంలో మంజూరైన ROB  నిర్మాణాన్ని ఐదేళ్లుగా సాగదీస్తున్నారని విమర్శించారు. జిల్లా కేంద్రంలో రోడ్లు అధ్వానంగా మారాయని,ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వానికి చేతకాకపోతే తానే స్వయంగా రోడ్లు బాగు చేయిస్తానన్నారు.

Latest Updates