దిశ ఘటనపై కేసీఆర్ కు సోయిలేదేం

హైదరాబాద్, వెలుగు:  ‘దిశ’ ఘటన దేశం మొత్తాన్ని ఉలిక్కిపడేలా చేసినా మన సీఎం కేసీఆర్‌‌ను మాత్రం కదిలించలేక పోయిందని మాజీ మంత్రి, బీజేపీ నేత డీకే అరుణ అన్నారు. మంత్రి కేటీఆర్ ప్రధానికి ట్వీట్ చేసి సలహాలివ్వడం కన్నా స్వయంగా వెళ్లి కలిస్తే బాగుంటుందన్నారు. మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్‌‌ల మాటలు చూస్తుంటే ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌‌గా లేదని అర్థమవుతోందన్నారు. బీజేపీ మహిళా మోర్చ ఆధ్వర్యంలో సోమవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌‌లో  ‘తెలంగాణ నిర్భయ’ అనే అంశంపై రౌండ్ టేబుల్ మీటింగ్‌‌ జరిగింది. పలువురు మహిళలు, స్వచ్చంధ సంస్థల ప్రతినిధులు పాల్గొని మాట్లాడారు.

నెల రోజుల్లో శిక్ష పడాలి

హైదరాబాద్‌‌ను అంతర్జాతీయ స్థాయి నగరం అంటున్న కేసీఆర్‌‌.. అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోనే జరిగిన ఘటనపై ఏం సమాధానం చెబుతారు. దిశ ఘటనపై ఫాస్ట్‌‌ ట్రాక్‌‌ కోర్టులో విచారణ చేపట్టాలి. నెల రోజుల్లో శిక్ష ఖరారు అయ్యేలా చూడాలి. టీవీ సీరియల్స్‌‌లోనూ మహిళలను కించపరిచేలా, విలన్లుగా చూపిస్తున్నారు. వాటిని అరికట్టాలి.

– డీకే అరుణ, బీజేపీ నేత

మహిళా కమిషన్‌‌ ఏదీ?

రాష్ట్రంలో మహిళా కమిషన్‌‌ ఏర్పాటు చేయకపోవడం చూస్తుంటే ప్రభుత్వానికి మహిళల సమస్యలపై ఎంత చిత్తశుద్ధి ఉందో తెలుస్తోంది. మంత్రులు మహమూద్ అలీ, తలసానిలు ‘దిశ’ ఘటనపై మాట్లాడిన తీరు చూస్తుంటే బాధ కలుగుతోంది. మహిళలపై దాడులను అరికట్టడంలో టీఆర్‌‌ఎస్‌‌ సర్కార్‌‌ విఫలమైంది.

– ఆకుల విజయ,

Latest Updates