నీ అంతు చూస్తా..! కిషన్ రెడ్డికి బెదిరింపు కాల్

కాచిగూడ , వెలుగు: మాజీ ఎమ్మెల్యే జి. కిషన్ రెడ్డికి మంగళవారం రాత్రి మరోసారి బెదిరింపు కాల్ వచ్చింది . నీ అంతు చూస్తానంటూ ఓ ఆగంతకుడు ఫోన్ చేసి బెదిరించడంతో కిషన్ రెడ్డి కాచిగూడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా కొంతమంది ఆగంతకులు ఇదే విధంగా ఫోన్ కాల్స్ చేసి బెదిరించడంతో కిషన్ రెడ్డి గతంలో నగర పోలీస్ కమిషనర్ కు కూడా ఫిర్యా దు చేశారు .

కిషన్ రెడ్డి ఫిర్యాదుతో  కాచిగూడ పోలీసులు 506 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఫోన్ కాల్ ఎవరు చేశారు, ఎక్కడి నుంచి చేశారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు కాచిగూడ సీఐ ఎస్.జానకి రెడ్డి తెలిపారు.

Latest Updates