TRS మెక్కిందంతా కక్కిస్తాం : లక్ష్మణ్

బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా రెండు రోజుల టూర్ ముగిసింది. పార్టీ ఆఫీస్ లో ప్రెస్ మెట్ పెట్టిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్… టీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో బీజేపీ సభ సక్సెస్ కావడంతో.. టీఆర్ఎస్ పీఠాలు కదులుతున్నాయన్నారు. నడ్డా ఎవరో తెలియదని కేటీఆర్ అనడం.. తన అహంకారాన్ని తెలుపుతోందన్నారు. కేటీఆర్ లాగా నడ్డా ప్యారాచూట్ పట్టుకొని రాజకీయాల్లోకి రాలేదన్నారు. కేటీఆర్ లాగా తండ్రి పేరు చెప్పుకుని రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి నడ్డా కాదన్నారు. కేటీఆర్ పుట్టక ముందే నడ్డా రాజకీయాల్లో ఉన్నారని కౌంటర్ ఇచ్చారు. నడ్డా కల్వకుంట్ల కుటుంబ బిడ్డ కాదు, భారతమాత ముద్దుబిడ్డ అనీ.. తండ్రి అధ్యక్షుడుగా ఉన్న పార్టీకి కొడుకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్న చరిత్ర టీఆర్ఎస్ ది అని విమర్శించారు లక్ష్మణ్.

తెలంగాణలో చరిత్ర సృష్టించబోతున్నాం.. కాస్కోండి

“’TRS కాంట్రాక్టర్ల జేబులు నింపే పనిపెట్టుకుంది. రైతు బంధు ఎందుకు బందయ్యింది… ఆరోగ్య శ్రీ ఎందుకు ఆగిపోయింది… మిషన్ కాకతీయ కమీషన్ కాకతీయగా మారింది నిజం కాదా? 2% కమీషన్ తీసుకొమ్మని కేటీఆర్ చెప్పారని మీ పార్టీ నాయకులే చెప్పారు. మెక్కిందంతా కక్కిస్తాం. డిస్కం, ప్రాజెక్టులు, కొనుగోలు అమ్మకాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. తెలంగాణలో చరిత్ర సృష్టించబోతున్నాం. కాస్కోండి. టీఆర్ఎస్ కు నిద్రలేని రాత్రులు రాబోతున్నాయి. హైదరాబాద్ ను మురికికూపంగా, విషాద నగరంగా టీఆర్ఎస్ మార్చేసింది. హుసేన్ సాగర్ ప్రక్షాళన కాదు కనీసం ఖైరతాబాద్ లో చెత్త కూడా తియ్యలేదు. రాజకీయంగా ఎదుర్కోలేక తప్పుడు కేసులు పెడుతున్నారు. మాది ఫామ్ హౌస్ పాలన కాదు. కేటీఆర్.. నిజామాబాద్ వెళ్లి మీ చెల్లి కవితని అడిగితే బీజేపీ ఎక్కడుందో చెపుతుంది” అన్నారు లక్ష్మణ్.

లక్ష్మణ్ చిట్ చాట్

ప్రెస్ మీట్ తర్వాత…. మీడియాతో లక్ష్మణ్ చిట్ చాట్ చేశారు. ఇంత పెద్ద స్థాయిలో చేరికలు రాష్ట్ర బీజేపీలో ఇదే మొదటిసారి అని చెప్పారు. అసలు సినిమా ముందుందని అన్నారు. యాక్టివ్ మెంబర్ షిప్ ఆగస్ట్ 20తో ముగుస్తుందన్నారు. ఇప్పటి వరకు 12 లక్షల మెంబర్ షిప్ దాటామన్నారు. హైదరాబాద్ ను యూటీ చేసే ఆలోచన బీజేపీకైతే లేదన్నారు. సెప్టెంబర్ 17న ప్రతీ పోలింగ్ బూత్ లో జెండా ఎగురవేస్తాం. వస్తానని అమిత్ షా కూడా సానుకూలంగా చెప్పారు. కొత్తగా పార్టీలో చేరే వారి వల్ల… బీజేపీ సిద్దాంతాలకు ఎటువంటి ఇబ్బంది ఉండదని అన్నారు లక్ష్మణ్.

Latest Updates