కేసీఆర్ బిడ్డను సైతం ఓడించాం: లక్ష్మణ్

bjp-leader-laxman-comments-on-lokhsabha-election-result

లోక్ సభ ఎన్నికల్లో కేసీఆర్ బిడ్డను సైతం ఓడించామన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ . తమ నలుగురు ఎంపీలు ఉద్దండుల మీద భారీ మెజారిటీ తో గెలిచారన్నారు. మోడీ హవా వల్ల గెలిచారని ఇప్పుడు కేటీఆర్ అంటున్నారు.. కానీ ఎన్నికల ముందు మోడీ హవా లేదన్నారు. ఉత్తర తెలంగాణ నుండి బిజెపి విజయదుంది మోగించామన్నారు లక్ష్మణ్.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చావు తప్పి కన్నులొట్ట పోయినట్టు అయ్యిందన్నారు .గెలిచిన మూడు స్థానాలకు పిసిసి ఉత్తమ్ జబ్బలు చరుచుకుంటున్నారని విమర్శించారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన19 ఎమ్మెల్యే ల్లో ఎంత మంది ఉన్నారో లెక్కలు చెప్పాలన్నారు. ప్రతిపక్ష హోదా అయిన ఉంటే ప్రజా సమస్యలు లేవనెత్తుతరని అనుకుంటే అది కూడా లేకుండా పార్టీ మారుతున్నారని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు కర్రుకాల్చి వాత పెట్టారని అన్నారు లక్ష్మణ్.

Latest Updates