పటేల్ లేకపోతే హైదరాబాద్ లేదు, తెలంగాణ లేదు: లక్ష్మణ్

సర్దార్ పటేల్ కి హైదరాబాద్ కి ప్రత్యేక అనుబంధం ఉందన్నారు  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్.  సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన లక్ష్మణ్..సర్దార్ లేక పోతే హైదరాబాద్ లేదు,తెలంగాణ లేదన్నారు. సర్దార్ చొరవ తీసుకొని నిజాంని తరిమికొట్టారన్నారు. పటేల్ ని  సీఎం గుర్తించక పోవడం దారుణమన్నారు.

దేశాన్ని ఏకం చేయడంలో సర్దార్ చేసిన కృషిని మరవలేమన్నారు  ,కేంద్రమంత్రి పురుషోత్తం రూపాల. మోడీ నాయకత్వం లో కేంద్రం శ్రేష్ట్ భారత్ వైపు పయనిస్తోందన్నారు. శ్రేష్ట్ భారత్ కోసం అందరం కృషి చేయాలన్నారు.

సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశ మొదటి కేంద్ర హోంశాఖ మంత్రి గా చేసిన సేవలు చాలా గొప్పవన్నారు మాజీ ఎంపీ వివేక్ వెంకట స్వామి. హైదరాబాద్ స్టేట్ ను భారత దేశంలో విలీనం చేసిన వ్యక్తి పటేల్ అని అన్నారు. పటేల్ జయంతి సందర్భంగా ఆయన చేసిన సేవలను గుర్తుంచుకొని.. ఆశయాల కోసం అందరూ పనిచేయాలన్నారు.

Latest Updates