మోడీ మొగాడు.. మొనగాడు: నాదేండ్ల భాస్కర్ రావు

bjp-leader-nadendla-bhaskara-rao-appreciate-to-pm-modi

దేశ భవిష్యత్తుకోసం జాతీయ పార్టీల అవసరం ఉందన్నారు మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నాయకులు నాదేండ్ల భాస్కర్ రావు. ఈ రోజు రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో మాట్లాడిన ఆయన… ప్రాంతీయ పార్టీలన్నీ కుల పార్టీలుగా, కుటుంబ పార్టీలుగా మారాయని అన్నారు. బీజేపీ రక్షణలో దేశం సురక్షితంగా ఉందన్నారు. ప్రధాని మోడీ మొగాడు… మొనగాడని కితాబిచ్చారు. వాజ్ పాయ్ హయంలోనే తాను బీజేపీలో చేరాల్సి ఉండెనని చెప్పారు. అయితే అప్పుడు  తన కొడుకు కాంగ్రెస్ తరపున స్పీకర్ గా పనిచేస్తున్నాడని.. అందుకే బీజేపీ లో చేరలేదని తెలిపారు.

రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ ద్వారా బీజేపీ జాతీయ చీఫ్ అమిత్ ఫా తనను పార్టీలో చేరాల్సిందిగా కోరారని నాదేండ్ల భాస్కర్ తెలిపారు. ఇటు తెలంగాణలో అటు ఆంధ్ర ప్రదేశ్ లో పార్టీ బలోపేతానికి తప్పకుండా కృషి చేస్తానని చెప్పారు. బీజేపీలో కార్యకర్తలా పనిచేయాలన్నదే తన ఉద్ధేశంమని అన్నారు.బీజేపీ మరో 20, 30 సంవత్సరాలు పనిచేయాలని అన్నారు. కాంగ్రెస్ పని అయిపోయిందని .. ఆ పార్టీకి నాయకుడే లేకుండా పోయాడని చెప్పారు నాదేండ్ల.