“వందసార్లు స్నానం చేసినా గేదెలాగే ఉంటారు”

BJP leader Raju Kage calls Kumaraswamy ‘buffalo’

కుమారస్వామిపై నోరు పారేసుకున్న బీజేపీ మాజీ ఎమ్మెల్యే

బెంగళూరు: కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామిపై ఓ బీజేపీ మాజీ ఎమ్మె ల్యే నోరు పారేసుకున్నాడు. కుమారస్వామి వందసార్లు స్నానం చేసినా ఆయన గేదెలాగానే ఉంటారంటూ కామెంట్ చేశారు. వారం క్రితం కుమార స్వామి ప్రధాని మోడీని ఉద్దేశించి మాట్లాడుతూ.. ఆయన ఉదయం కెమెరా ముందుకు, జనం మధ్యకు రావాలంటే మేకప్ ఉండాల్సిందేనని, ఆ తర్వాత కూడా పౌడర్ రాసుకునే మీడియా ముందుకు వస్తారని చెప్పారు. దీనిపై బీజేపీ మాజీ ఎమ్మెల్యే రాజు కాగే స్పందిస్తూ.. ప్రధాని మోడీ రోజుకు10 సార్లు పౌడర్ రాసుకుంటారని, పదిజతల బట్టలు మారుస్తారంటూ కుమారస్వామి అన్నా రని, మోడీ అందంగా.. తెల్లగా ఉంటారని, కానీ కుమారస్వామి వంద సార్లు స్నానం చేసినా గేదెలాగానే ఉంటారంటూఎద్దేవా చేశారు.

Latest Updates