BJP నేత వీరేందర్ గౌడ్ అరెస్ట్

BJP నేత వీరేందర్ గౌడ్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా టీఆర్ఎస్ వ్యవహరిస్తోందని ఆరోపించారు వీరేందర్ గౌడ్. తుక్కుగూడ మున్సిపాలిటీలో బీజేపీకి క్లీన్ మెజార్టీ ఉన్నా… టీఆర్ఎస్ ఛైర్మన్ పీఠం కైవసం చేసుకునేందుకు చూస్తోందని ఆరోపించారు. ఐదు ఎక్స్ అఫిషియో ఓట్లతో తుక్కుగూడలో గెలవాలని చూస్తున్న టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. తుక్కుగూడ మున్సిపాలిటీ ముందు ధర్నాకు దిగడంతో.. అరెస్ట్ చేసి పీఎస్ కు తరలించారు.

Latest Updates