ఫాంహౌస్ ల మీద ఉన్న శ్రద్ధ… కరోనాని నియంత్రించడంలో లేదు

మంచిర్యాల జిల్లా: కల్వకుంట్ల కుటుంబానికి ఫాంహౌస్ ల మీద ఉన్న శ్రద్ధ… కరోనాని నియంత్రించడంలో లేదని విమర్శించారు బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. కరోనాను నియంత్రించడంలో TRS సర్కార్ విఫలమైందన్నారు. మంచిర్యాల  జిల్లా రాంపూర్ సరస్వతి శిశుమందిర్ కు కాకా వెంకటస్వామి ఫౌండేషన్ తరపున 25 వేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించారు వివేక్ వెంకటస్వామి.

సరైన రక్షణ కల్పించకుండా వైద్య సిబ్బంది ప్రాణాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు.  ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన గచ్చిబౌలి హాస్పిటల్ లో ఎందుకు ట్రీట్ మెంట్ చేయడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రపంచం మెచ్చుకునేలా ప్రధాని మోడీ కరోనాని నియంత్రించారని చెప్పారు. పేదల బాగు కోసమే కేంద్ర ప్రభుత్వం.. 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించిందని తెలిపారు వివేక్ వెంకటస్వామి.

Latest Updates