కేసీఆర్, కేటీఆర్ ప్రజల సొమ్మును దోచుకుతింటున్నారు

తెరాస ప్రభుత్వంలో పేదలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని మాజీ ఎంపీ, బీజేపీ సీనియర్ నాయకులు వివేక్ వెంకటస్వామి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కొడుకు కేటీఆర్ ప్రజల సొమ్మును దోచుకుతింటున్నారని ఆయన అన్నారు. జీహెచ్ఎంసీ ఎలక్షన్ ప్రచారంలో భాగంగా రహ్మత్ నగర్‌లో బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి కొలను వెంకటేష్ తరపున వివేక్ వెంకటస్వామి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో తెలంగాణ ప్రభుత్వం అరాచకాలు అరికట్టేందుకు బీజేపీ సిద్ధమైనట్లు ఆయన తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ అధికార పీఠాన్ని సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గ్రేటర్‌లో బీజేపీ అధికారం చేపట్టబోతోందని ఆయన అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వరదల్లో నష్టపోయిన పేదల చేత జన్ ధన్ ఖాతాలు ఓపెన్ చేయించి వారికి ఆర్థిక సాయం అందిస్తామని ఆయన అన్నారు. రహ్మత్ నగర్ బీజేపీ అభ్యర్థి కొలను వెంకటేష్ అత్యధిక మెజార్టీతో గెలుస్తారని ఆయన అన్నారు. వరద బాధితులను ఆదుకోవడంలో కేసీఆర్, కేటీఆర్‌లు కుమ్మక్కై వరద సహాయం నొక్కేశారని ఆయన ఆరోపించారు.

For More News..

తొమ్మిది రోజుల్లో ఎనిమిది సార్లు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

ఓటరు కార్డు లేకున్నా ఓటేయొచ్చు

వ్యాక్సిన్ ట్రయల్‌తో ఆరోగ్యం పాడైంది.. రూ. 5 కోట్ల పరిహారమివ్వాలంటూ వాలంటీర్ నోటీసు

Latest Updates