పేరుకే హెల్త్ సెంటర్స్.. ఎక్కడా పనిచేయవు..!

జిల్లా పర్యటనలో భాగంగా సర్కార్ తీరుపై మండిపడ్డారు బీజేపీ నేత, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. యాదాద్రి భువనగిరి జిల్లా రేణికుంటలో PHCకి తాళం వేయటంపై ఆయన ఫైర్ అయ్యారు. పేరుకే హెల్త్ సెంటర్స్ కానీ… ఎక్కడ పనిచేయటం లేదన్నారు. ప్రజలు కరోనాతో బాధపడుతుంటే… రాష్ట్రంలో PHCలకి తాళాలు వెస్తున్నారన్నారు. జనం ప్రవేట్ ఆస్పత్రులకు వెళ్తే లక్షల రూపాయల బిల్లులు వేస్తున్నారని మండిపడ్డారు వివేక్ వెంకటస్వామి.

Latest Updates