కేంద్రం రూ.7 వేల కోట్లు ఇస్తే..ఆ డబ్బులతో సెక్ర‌టేరియట్ కడుతానంటున్నాడు

కరోన సమయం లో ఎవరిని ఎవరూ పట్టించుకోని సమయంలో పేద ప్రజలకు బీజేపీ అండగా నిలిచిందన్నారు మాజీ ఎంపీ, ఆ పార్టీ నేత వివేక్ వెంక‌ట స్వామి. క‌రోనా వేళ పారిశుధ్య కార్మికుల శ్ర‌మ‌ను గుర్తించిన వ్యక్తి దేశ ప్రధాని నరేంద్ర మోడీ అని అన్నారు. ప్రధాని ఇచ్చిన పిలుపు మేరకు పారిశుధ్య కార్మికులను సన్మానిస్తున్నామ‌ని వివేక్ చెప్పారు. భారతీయ జనతా పార్టీ పేదలకు అండగా ఉంటుందన్నారు

సీఎం కేసీఆర్ తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చార‌న్నారు. కేంద్రం 7 వేల కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఇస్తే..ఆ డబ్బులు ప్రజల కోసం ఖర్చు చేయకుండా సెక్రటేరియట్ కడుతం అని అంటున్నారు. కాంట్రాక్ట్ వర్కర్లను రేగులరైజ్ చేస్తాం అని చెప్పి..మాట మార్చిన వ్యక్తి కేసిఆర్ అని అన్నారు. పేద ప్రజలను పట్టించుకోకుండా.. కాంట్రాక్టర్ల ను మాత్ర‌మే సీఎం పట్టించుకుంటాడని అన్నారు.

Latest Updates