కేసీఆర్ దళిత ద్రోహి

పెద్దపల్లి జిల్లా: కేసీఆర్ దళిత ద్రోహి అన్నారు మాజీ ఎంపీ, బీజీపీ లీడర్ వివేక్ వెంకటస్వామి. గోదావరిఖనిలో మాట్లాడిన ఆయన..తెలంగాణకు ఎస్సీని సీఎం చేస్తా అని కేసీఆర్ దళితులను మోసం చేసిండన్నారు. రామగుండం కార్పొరేషన్ లో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను ప్రభుత్వం పక్కదారి పట్టించి ఎస్సీలకు అన్యాయం చేస్తుందని తెలిపారు. కొడుకును సీఎం చేస్తే చేసుకో కానీ.. ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. కేసీఆర్ అసెంబ్లీలో చెప్పినట్టు సబ్ ప్లాన్ నిధులను ఖర్చు పెట్టాలన్న వివేక్..మాజీ ఎమ్మెల్యే మాలం మల్లేశం స్మశాన వాటికను ద్వంసం చేసిన వారిని వెంటనే అరెస్ట్ చెయ్యాలని డిమాండ్ చేశారు.

Latest Updates