హైదరాబాద్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు

హైదరాబాద్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు అని బీజేపీ కోర్ కమిటీ సభ్యులు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలలో భాగంగా జియాగూడ డివిజన్‌లో బీజేపీ అభ్యర్థి దర్శన్‌కు మద్దతుగా ఆయన ప్రచారంలో పాల్గొన్నారు. డివిజన్‌లో బీజేపీని గెలిపిస్తే జియగూడాలో కట్టిన డబుల్ బెడ్ రూమ్‌లను స్థానికులకు కేటాయిస్తామని ఆయన అన్నారు. హిమామ్ నగర్‌లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఆయన ప్రచారం ప్రారంభించారు. గ్రేటర్‌లో బీజేపీ విజయం సాధించిన తర్వాత వరద బాధితులకు 25 వేల సాయం చేస్తామని ఆయన అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ అభివృద్ధి కోసం 67వేల కోట్లు ఖర్చు చేశామని చెబుతోందని, కానీ అభివృద్ధి మాత్రం ఎక్కడా కనిపించడంలేదని ఆయన ఎద్దేవా చేశారు. నగరంలో ఏర్పాటు చేసిన మీ హోర్డింగులకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని ఆయన ప్రశ్నించారు. ఎలక్షన్ కమిషన్ స్పందించి.. టీఆర్ఎస్ పార్టీ పెట్టిన హోర్డింగులను వెంటనే తొలగించాలని ఆయన కోరారు. ఎలక్షన్ కమిషన్ ఫ్రీ అండ్ ఫేర్‌గా జీహెచ్ఎంసీ ఎలక్షన్లు నిర్వహించాలని ఆయన అన్నారు. దుబ్బాకలో గెలిచినట్టు జీహెచ్ఎంసీ కూడా బీజేపీ గెలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

For More News..

టీఆర్ఎస్, బీజేపీలది ఢిల్లీలో దోస్తీ.. గల్లీలో కుస్తీ

డిజిటల్ మీడియా వ్యాప్తికోసం ఇ-కాన్‌క్లేవ్‌

రేప్ చేస్తే అది పనిచేయకుండా శిక్ష

Latest Updates