కాంట్రాక్టర్లకు నిధులు..రాష్ట్రానికి అప్పులు

కేసీఆర్ ఏడాది పాలనలో సాధించిందేమి లేదన్నారు బీజేపీ నేత మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న కేసీఆర్ కుటుంబ సభ్యులకు మాత్రమే ఉద్యోగాలు ఇచ్చారన్నారు. కాంట్రాక్టర్లకు దోచి పెడుతూ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని అన్నారు. కేసీఆర్ ది నియంతృత్వ పాలన, తుగ్లక్ పాలన అని అన్నారు. కమీషన్ ఇవ్వడం లేదని చిన్న కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం లేదన్నారు.  ఓట్ల కోసం అసత్యాలు మాట్లాడుతూ ప్రజల దృష్టిని మరలుస్తున్నారన్నార. కుటుంబ సభ్యులకు పదవులిస్తూ.. కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేసేందుకు  కేసీఆర్ ప్లాన్ వేస్తున్నారని అన్నారు.

 

Latest Updates