కరోనా సోకాలనుకున్నాడు..నిజంగానే సోకింది

కొద్దిరోజుల క్రితం తనకు కరోనా వస్తే సీఎం కు అంటిస్తానంటూ ఓ నేత వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఆ వ్యాఖ్యలు ఇప్పుడు ఆయనకే బెడిసి కొట్టాయి.బీజేపీ జాతీయ కార్యదర్శి అనుపమ్ హజ్రాకు కరోనా సోకింది. గత నెల 27న ఆయన ఓ కార్యక్రమంలో మట్లాడుతూ కరోనా వ్యాఖ్యాలు చేశారు. కరోనా రోగుల సమస్యలను పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి  మమతా బెనర్జీ  పట్టించుకోవడం లేదని, ఆమెకు కరోనా వస్తే వారి గోడు అర్థమవుతుందని వ్యాఖ్యానించారు. అంతేకాదు తనకి కరోనా వస్తే సీఎం మమతకు అంటిస్తానంటూ హెచ్చరించారు. తాజాగా  హజ్రాకు అనారోగ్య సమస్యలు తలెత్తడంతో డాక్టర్లు కరోనా టెస్ట్ లు చేశారు. ఈ కరోనా టెస్ట్ లో ఆయనకు పాజిటీవ్ వచ్చింది. ప్రస్తుతం హజ్రాను పశ్చిమ బెంగాల్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చినట్ల ఆరాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. అయితే హజ్రా తన పై చేసిన వ్యాఖ్యల్ని ఖండించిన ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన  తృణమూల్‌ కాంగ్రెస్‌   పోలీసులకు  ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Latest Updates