బీజేపీ అంటే కేసీఆర్ కు భ‌యంతోనే అరెస్టులు

యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా: సీఎం కేసీఆర్ యాదాద్రి పర్యటన క్ర‌మంలో భారతీయ జనతా పార్టీ యాదగిరిగుట్ట నేతలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ అరెస్టులను బీజేపీ జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యామ్ సుందర్, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండ్రు శోభారాణి, జిల్లా ఉపాధ్యక్షుడు రాఘవుల నరేందర్ లు తీవ్రంగా ఖండించారు. కేసీఆర్ తన ఒంటెద్దు పోకడలను ప్రశ్నిస్తున్న వారందరి మీద అక్రమ అరెస్టులతో అణిచివేత ధోరణి అవలంభిస్తున్నాడన్నారు.

యాదగిరిగుట్ట పర్యటన సందర్బముగా బీజేపీ నాయకుల అరెస్టుతో ..బీజేపీ అంటే కేసీఆర్ కు భయం పట్టుకుందని రాష్ట్ర ఊపాధ్యక్షురాలు బండ్రు శోభారాణి ఎద్దేవా చేశారు. నేతల అరెస్టు అక్రమమని వారిని బేషరతుగా విడుదల చేయాలి అని జిల్లా ఉపాధ్యక్షుడు రాఘవుల నరేందర్ గారు డిమాండ్ చేశారు. అరెస్టైన వారిలో సీనియర్ నాయకులు రచ్చ శ్రీనివాస్, యాదగిరిగుట్ట పట్టణ ప్రధాన కార్యదర్శి బెలిదే అశోక్ , నాయకులు కాదురీ అచ్చయ్య తదితరులు ఉన్నారు.

Latest Updates