కేసీఆర్‌ సభ్యసమాజానికి ఏం మెసేజ్‌ ఇస్తున్నారు

రంగారెడ్డి జిల్లా : అశ్లీలతకు సపోర్ట్ చేసి సీఎం కేసీఆర్‌ సభ్యసమాజానికి ఏం మెసేజ్‌ ఇస్తున్నారని ప్రశ్నించారు రాజేంద్ర నగర్ బీజేపీ నాయకులు. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాశ్ పై దాడి అప్రజాస్వామికమని రాజేంద్ర నగర్ సర్కిల్ అత్తాపూర్ డివిజన్ లో బుధవారం సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. మై హోం రామేశ్వర్ రావు కుమారుడు.. రాము రావుకు సంబంధించిన ఆన్ లైన్ ప్లాట్ ఫామ్ సినిమా డర్టీ హరి అశ్లీలతపై మంగళవారం తివోలి గార్డెన్ సర్కిల్ లో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తుంటే.. పోలీసులు, మై హోమ్ రామేశ్వర రావు గుండాలు పోలీసుల ముసుగులో భాను ప్రకాష్ పై దాడి చేయడపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అశ్లీలతపై ప్రశ్నిస్తే భౌతికదాడులు చేస్తారా అని ప్రశ్నించారు. మై హోమ్ రామేశ్వర్ కుమారుడు రాము రావు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని తండ్రి అంగబలం తోడుందన్న అహంకారంతో మదమెక్కి..  ఆన్ లైన్ సినిమాల పేరుతో అశ్లీల చిత్రాలను విడుదల చేయించి డబ్బులు సంపాదించాలని అనుకుంటున్నారన్నారు.

ఒకవైపు తండ్రి రాష్ట్ర ప్రభుత్వ అండతో కొన్ని వెల్లు కోట్ల విలువ చేసే దేవాలయ, ప్రభుత్వ భూములను, నిరుపేద రైతు పొలాలను కబ్జా చేస్తూ.. మరోవైపు కుమారుడు రాము రావు అశ్లీల సినిమాలు తీసుకుంటా డబ్బులు పోగేసుకుంటున్నారని తెలిపారు.. భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడిపై మై హోం గూండాలతో సహా రాష్ట్ర పోలిసులు ప్రవర్తించిన తీరును త్రీవంగా ఖండిస్తూ డర్టీ హరి సినిమాను తక్షణమే నిషేధించాలన్నారు. యువతను తప్పుదారి పట్టించే అలాంటి బూతు సినిమా ఆన్ లైన్.. యూట్యూబ్ ఓటీటీలను బ్యాన్‌ చేయాలని హెచ్చరించారు. లేనిచో ఆందోళనలు పెద్ద ఎత్తున నిర్వహిస్తామని హెచ్చరించారు బీజేపీ నేతలు.

Latest Updates