కేంద్ర నిధుల్ని జేబుల్లో నింపుకుంటున్న దౌర్భాగ్యపు సీఎం ఈ కేసీఆర్ : బండి సంజయ్

రాష్ట్రానికి వందల కోట్ల రూపాయల ఆర్ధిక ప్యాకేజీ ని కేంద్ర ప్రభుత్వం అందిస్తే ఆ నిధులను సీఎం కేసీఆర్ పక్క దోవ పట్టించారని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఆరోపించారు. తప్పులను కప్పి పుచ్చుకునేందుకు, రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టేందుకు కేంద్రంపై కేసీఆర్ నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం పథకాలను సొంత పథకాలుగా చెప్పుకుంటూ అహంకార పూరితంగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారు. కేంద్రం నిధులను జేబులు నింపు కోవడమే ఆయన లక్ష్యంగా కనిపిస్తున్నది. ఇంతటి దౌర్భాగ్యపు సీఎం ఈ కేసీఆర్ అని సంజయ్ విమర్శించారు.

సెకండ్ టర్మ్ ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ప్రధాని మోడీ దేశ ప్రజలకు రాసిన లేఖలను ప్రజల కు వివరించేందుకు రాష్ట్ర బీజేపీ గురువారం నుంచి ‘ఇంటింటికి మోడీ సందేశం’ పేరిట కార్యక్రమాన్ని ప్రారంభించింది. హైదరాబాద్ లోని  ముషీరాబాద్ బీజేపీ నియోజకవర్గం ఆఫీస్ నుంచి మొదలైన ఈ కార్య క్రమంలో బండి సంజయ్, పార్టీ నేతలు పాల్గొన్నారు. వారంతా ఇండ్లకు వెళ్లి మోడీ పంపిన లేఖలను ప్రజల కు అందజేసి కేంద్ర పథకాలను వివరించారు.

ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరోనా చావులతో పాటు ఆకలి చావులు లేవంటే అది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చొరవేనని.. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. కేంద్రం విధించిన లాక్ డౌన్ తోనే మర్కజ్ వెళ్లి వచ్చిన వారిని బయటకు తిరగకుండా కట్టడి చేయగలిగామని, ఒకవేళ లాక్ డౌన్ లేకుంటే వారు బయట తిరిగితే పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకుంటేనే భయ మేస్తుందని చెప్పారు. రాష్ట్రం లో లాక్ డౌన్ టైంలో బీజేపీ విస్తృతంగా చేపట్టిన పలు సేవా కార్యక్రమాలతోనే పేదలెవరూ కూడా ఆకలి చావులకు గురి కాలేదన్నారు. రాష్ట్రంలో మున్సిపల్ కార్పొరేషన్ల అభివృద్ధి కి అంతా కేంద్రం నిధులేనని, రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఇవ్వలేదని సంజయ్ చెప్పారు. గ్రామ పంచాయతీలకు కూడా కేంద్రం ఇచ్చిన 14వ ఫైనాన్స్ కమిషన్ నిధులు తప్ప, రాష్ట్ర ప్రభుత్వం నయా పైసా ఖర్చు చేయలేదన్నారు. కరోనా కట్టడికి రాష్ట్ర సర్కార్ చేసిన ఖర్చెంత? రాష్ట్రంలో కరోనా కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో స్పష్టం చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. రాష్ట్ర సర్కార్ వైఫల్యం ఏమిటనేది గాంధీ హాస్పిటల్ కు వెళ్తే తెస్తుందన్నారు. కేసీఆర్ చేతకాని తనం వల్లే గాంధీ హాస్పిటల్లో డాక్టర్లపై  దాడులు జరుగుతున్నాయని చెప్పారు. డాక్టర్లు ఆందోళన చేస్తుంటే వారిని సర్కారు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.

ఈ నెల 17 వరకు ‘ఇంటింటిలకీ మోడీ సందేశం’ ‘ఇంటింటికి మోడీ సందేశం’ ద్వారా రాష్ట్రంలో 30 లక్షల కుటుంబాలను తమ పార్టీ కార్యకర్తలు కలిసి మోడీ లేఖలను అందజేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంజయ్‌ చెప్పారు. ఈ నెల 17 వరకు ఈ ప్రోగ్రామ్ కొనసాగుతోందన్నారు. ప్రతి నాయకుడు ఈ కార్యక్రమం ద్వారా 25 కుటుంబాలను కలుస్తారన్నారు. గల్ఫ్ లోని తెలంగాణ వాళ్లను రప్పించాలి కరోనా ఎఫెక్ట్ తో  గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయిన తెలంగాణ వాసులను స్వస్థలాలకు రప్పించాలని కోరుతూ కేంద్ర మంత్రులకు బీజేపీ స్టేట్ చీఫ్ , ఎంపీ బండి సంజయ్ గురువారం లేఖలు రాశారు. గల్ఫ్ దేశాల్లో సుమారు 10 లక్షల మంది తెలంగాణ వాసులు పని చేస్తున్నారని, వీరంతా బతుకుదెరువు కోసం వెళ్లాల్సిన వారేనని ఏవియేషన్ మినిస్టర్ హర్దీప్ సింగ్ పూరి, విదేశీ వ్యవహారాల మంత్రి మురళీధరన్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్ డి కి ఆయన లేఖలు రాశారు.

కేంద్రం, హైకోర్టు చెప్పినా టెస్టులు పెంచారా?: డీకే అరుణ

కరోనా టెస్టులు పెంచాలంటూ కేంద్రం, హైకోర్టు చెబుతున్నా రాష్ట్ర సర్కారు పట్టించుకోవటం లేదని బీజేపీ నేత డీకే అరుణ అన్నారు. టెస్టులు ఎక్కువ చేయటం ద్వారానే కరోనాను అడ్డుకోవచ్చని చెప్పారు. ఈ విషయంలో ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహారిస్తుందో సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం పత్రిక ప్రకటన విడుదల చేశారు. ఐసీఎంఆర్ నిబంధనల పేరుతో తగిన స్థాయిలో టెస్టులు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు.

19న నడ్డా వర్చువల్ ర్యాలీ

ప్రధాని మోడీ సెకండ్ టర్మ్ ఏడాది పాలనపై రాష్ట్రంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వర్చువల్ ర్యాలీ ఈ నెల 19న ఉంటుందని సంజయ్ వెల్లడించారు. డిజిటల్ వేదికగా నడ్డా ప్రసంగిస్తారని చెప్పారు. రాష్ట్రంలో కేంద్ర పథకాల అమలు తీరును తెలుసుకుంటామన్నారు.

నేడు ప్రగతిభవన్ కు

బీజేపీ నేతలు హైదరాబాద్ లో రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయని, వాటిని కట్టడి చేసేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్చేస్తూ ‘సేవ్ హైదరాబాద్ ఫ్రమ్ కరోనా ’ పేరిట శుక్రవారం ప్రగతి భవన్ కు బీజేపీ నేతలు వెళ్లనున్నారని ఆ పార్టీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ప్రకటించారు. ఎమ్మెల్సీరాంచందర్ రావు, ఎమ్మెల్యే రాజాసింగ్, పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్ సీఎంను కలిసేందుకువెళ్తారని వెల్లడించారు.

కరెంట్ బిల్లులపై 15న నిరసనలు

అధిక కరెంటు బిల్ లులను వ్యతిరేకిస్తూ ఈ నెల 15న రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టను న్నట్లుబండి సంజయ్ ప్రకటించారు. ఈ బిల్ లులను రద్దుచేయాలనే ప్రధాన డిమాండ్ తో 15న హైదరాబాద్లోని విద్యుత్ సౌధ ఎదుట, అలాగే రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని విద్యుత్ ఎస్ ఈ ఆఫీసుల ముందు తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన కార్యక్రమం చేపడుతారని వివరించారు.

 

 

Latest Updates