వ్యాక్సినేషన్ ఫ్లెక్సీలపై మోడీ ఫోటో ఎక్కడ?…బీజేపీ ఆందోళన

వ్యాక్సినేషన్ సందర్భంగా వరంగల్ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. వ్యాక్సినేషన్ ఫ్లెక్సీలపై ప్రధాని మోడీ ఫొటో  లేకపోవడంపై బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. MGM హాస్పిటల్ లోని కొవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ దగ్గర ఫ్లెక్సీలు చింపేసి.. ఆందోళనకు దిగారు. ప్రధాని మోడీ ఫొటో లేకపోవడంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశాయిపేట వ్యాక్సిన్ పంపిణీ కేంద్రం దగ్గర కూడా బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. అక్కడే ఉన్న TRS  నేతలు పోటీగా నినాదాలు చేశారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. TRS, బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. తర్వాత రెండు పార్టీల నాయకులకు సర్దిచెప్పి అక్కడి నుంచి పంపించారు పోలీసులు.

see more news

సుడిగాలి సుధీర్ వల్లే నాకు టీం లీడర్ ఇవ్వలే

భయపడొద్దు.. టీకా వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవ్

మోడీ నోట తెలుగు పద్యం.. వ్యాక్సిన్ ప్రారంభించిన ప్రధాని

అడవిలో మళ్లీ బుల్లెట్ మ్యాగ్జిన్.. ఎవరిది?

Latest Updates