ప్రభుత్వ తప్పిదానికి 26మంది బలి : పరామర్శల్లో BJP

ప్రభుత్వ తప్పిదాలతోనే 26 మంది ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యకు పాల్పడ్డారన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షడు లక్ష్మణ్. సనత్ నగర్ చాచా నెహ్రు నగర్ లో ఆత్మహత్య చేసుకున్న ఇంటర్ విద్యార్థిని అనామిక కుటుంబ సభ్యులను BJP బృందం పరామర్శించింది. ఇంటర్ తప్పిదాలపై నిరవధిక దీక్ష చేసినా ప్రభుత్వంలో చలనం రాలేదన్నారు లక్ష్మణ్. ఫస్ట్ ఇయర్ లో మంచి మార్కులు సాధించి .. రెండో ఏడాదిలో ఎలా ఫెయిల్ అవుతారని ప్రశ్నించారు. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలన్నీ… ప్రభుత్వ హత్యలన్నారు లక్ష్మణ్.

మరోవైపు.. ఆత్మహత్య చేసుకున్న అరవింద్ కుటుంబ సభ్యులను పరామర్శించారు దత్తాత్రేయ. జనగామ జిల్లా నర్సాపూర్ గ్రామానికి చెందిన అరవింద్ కుటుంబ సభ్యులను దత్తాత్రేయ బృందం ఓదార్చింది. చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు న్యాయం జరిగే వరకు బీజేపీ పోరాటం ఆగదన్నారు దత్తాత్రేయ.

Latest Updates