ఉపవాస దీక్ష విరమించిన బీజేపీ నేతలు

GHMC ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికార దుర్వినియోగంపై బీజేపీ నేతలు నిరసన వ్యక్తం చేస్తూ..ఉదయం నుంచి సాయంత్రం వరకు డీకే అరుణ, లక్ష్మణ్, వివేక్ వెంకటస్వామిలు ఉపవాస దీక్ష చేశారు. నేతలకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింప చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన… వాస్తవాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఈ దీక్ష చేశారన్నారు. ఎన్నికల సంఘం, పోలీస్ లు సీఎం కేసీఆర్ చెప్పు చేతల్లో ఉన్నారన్నారు. ఎన్నికలన్లో గెలిచేందుకు విచ్చల విడిగా డబ్బులు, మద్యం పంచారని తెలిపారు. అడ్డుకున్న బీజేపీ కార్యకర్తల పైనే కేసులు పెట్టడంతో పాటు… లాఠీ ఛార్జ్ చేశారన్నారు. గ్రేటర్ లో…ఎన్నికల పోలింగ్ శాతాన్ని తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు..తగ్గించారన్నారని ఆరోపించారు బండి సంజయ్.

పొలింగ్ శాతం ను పెంచేందుకు ప్రయత్నం చేయాల్సిందే పోయి తగ్గించడానికి కృషిన పోలీస్ లకు, ఎన్నికల సంఘానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇంత కంటే దుర్మార్గం మరొకటి లేదన్నారు. అనుకూలంగా ఉన్న అధికారులనే ఎన్నికల్లో నియమించుకున్నారని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి డైరెక్షన్ లో ఎన్నికల జరిగాయంటే దేశంలో చరిత్ర సృష్టించారని చెప్పారు. ఎన్నికల కమిషన్, పోలీస్ లు TRS, MIM  కు పూర్తి సహకారం అందించారన్నారు.

అంతేకాదు కారు గుర్తుకు బ్యాలెట్ పేపర్ లో బాక్స్ వేసి ముద్రించారన్న బండి సంజయ్.. అందరూ గుర్తించేలా ఫ్రింట్ చేశారన్నారు. పువ్వు గుర్తును మాత్రం సరిగా ఫ్రింట్ చేయలేదన్నారు. ఒక ప్లాన్ ప్రకారం ఎన్నికల్లో గెలవాలని అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని అయినా.. ప్రజలు బీజేపీకే ఓటేశారని తెలిపారు.

Latest Updates