కుట్ర చేసి ఛైర్మన్ పదవిని లాక్కున్నరు

తుక్కుగూడ మున్సిపల్ ఛైర్మన్ పదవిని TRS దొడ్డిదారిలో కొట్టేసిందన్నారు బీజేపీ నేతలు. 15 వార్డులకు తాము తొమ్మిది గెలిచినా…. కుట్ర చేసి ఛైర్మన్ పదవిని లాక్కున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ తీరుకు నిరసనగా తుక్కుగూడలో బంద్ నిర్వహించారు.మంత్రి సబిత ఇంద్రారెడ్డి దిష్టి బొమ్మను ఊరేగించి, చెప్పుతో కొట్టారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి….. అధికార బలంతో నీచ రాజకీయాలు చేస్తోందన్నారు బీజేపీ నేతలు. ఏపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న ఎంపీ కేశవరావు… ఇక్కడ ఎక్స్ ఆఫీసియో ఎలా అవుతారో చెప్పాలని డిమాండ్ చేశారు. కుట్రతో అధికారాన్ని ధక్కించుకోవచ్చు కానీ… ప్రజా బలాన్ని పొందలేరని జిల్లా అధ్యక్షులు బొక్క నర్సింహ రెడ్డి, తూళ్ల వీరేందర్ గౌడ్, జనార్దన్ రెడ్డి, మహిళ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Latest Updates