నిజామాబాద్ కార్పొరేషన్‌లో బీజేపీ లీడ్

నిజామాబాద్ కార్పొరేషన్‌లో బీజేపీ ముందంజలో ఉంది. ఇక్కడ పోటీ బీజేపీకి, ఎంఐఎంకి మధ్య నడుస్తోంది. మొత్తం 60 డివిజన్లు ఉన్న ఈ కార్పొరేషన్‌లో మధ్యాహ్నం మూడు గంటల వరకు 16 చోట్ల బీజేపీ విజయం సాధించింది. ఎంఐఎం పార్టీ 9 చోట్ల గెలిచి రెండో స్థానంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ ఒక్క సీటు గెలుచుకుంది. ఇప్పటి వరకు ఆధికార టీఆర్ఎస్ పార్టీ ఒక్క సీటు కూడా తన ఖాతాలో వేసుకోలేదు. అయితే 15 డివిజన్లలో లీడ్‌లో కొనసాగుతోంది. పూర్తి ఫలితం వచ్చేసరికి విజయం ఎవరిని వరిస్తుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.