యూపీలో బీజేపీకి షాక్.. పార్టీని వీడిన మరో మంత్రి

V6 Velugu Posted on Jan 13, 2022

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి రాజీనామాలు కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పటికే ఇద్దరు మంత్రులు రాజీనామా చేయగా..లేటెస్ట్ గా మూడో మంత్రి కూడా పార్టీని వీడినట్లు ప్రకటించారు. మంత్రి, ఒబిసి నేత ధరమ్‌ సింగ్‌ సైనీ యోగి కేబినెట్‌కి రాజీనామా చేశారు.  ఆ తర్వాత ..మాజీ సీఎం, సమాజ్ వాదీ పార్టీ  అధినేత అఖిలేష్ యాదవ్ తో భేటీ అయ్యారు. ఆ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ధరమ్ సింగ్ లాంటి నేతల చేరికలతో తమ పార్టీ మరింత బలం పుంజుకుంటోందని అఖిలేష్ ట్వీట్ చేశారు. 

ధరమ్‌ సింగ్‌ సైనీ సహరాన్‌పూర్‌లోని నకుడ్‌ నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గడిచిన మూడురోజుల్లో వరుసగా పార్టీని వీడిన వారిలో ధరమ్‌ సింగ్‌ సైనీ మూడవ మంత్రి, ఎనిమిదవ ఎమ్మెల్యే. మొదట బహుజన సమాజ్‌ పార్టీ (BSP)లో ఉన్న సైనీ,. 2016లో బీజేపీలో  చేరారు.ప్రస్తుతం సిట్టింగ్‌ ఎమ్మెల్యే ముఖేష్‌ వర్మ రాజీనామా చేసిన గంటల వ్యవధిలోనే మంత్రి రాజీనామా చేయడం తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపుతోంది.

 

 

 

 

మరిన్ని వార్తల కోసం..

ఎస్ఎంఎస్ ద్వారా సీఎం అభ్యర్థి ఎంపిక

 

Tagged Resigns , BJP loses, third minister, Dharam Singh Saini, joins Samajwadi Party

Latest Videos

Subscribe Now

More News