ఆ MIM కార్పొరేట‌ర్‌ని అరెస్ట్ చేయాలి: రాజాసింగ్

హైద‌రాబాద్: విధులు నిర్వహిస్తున్న పోలీసు కానిస్టేబుల్ పట్ల కిష‌న్ బాగ్ MIM కార్పొరేటర్ దురుసుగా వ్య‌వ‌రించ‌డంపై గోషామ‌హ‌ల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగా మండిప‌డ్డారు. డ్యూటిలో ఉన్న కానిస్టేబుల్ కు MIM కార్పొరేటర్ వార్నింగ్ ఇస్తుంటే పోలీసు ఉన్నతాధికారులు, ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం చేస్తున్నట్టు? అని ప్ర‌శ్నించారు. ఆ కార్పొరేటర్ పై ఇంత వరకూ చర్యలు ఎందుకు తీసుకోలేద‌ని అడిగారు. MIM అంటే పోలీసులు కూడా భయపడుతున్నారా? అని ప్ర‌శ్నించారు.

ఇదే విధంగా బీజేపీ కార్యకర్తలు వ్యవరించి ఉంటే అధికారులు ఊరుకునే వారేనా? ఈ పాటికే కేసులు బుక్ చేసి జైల్లో పెట్టేవారు అని రాజాసింగ్ అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా పోలీసులు రాత్రి పగలు తేడా లేకుండా..  ఎండనక ,వాననక కష్టపడుతుంటే MIM నేతలు పోలీసులపై దురుసుగా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని అన్నారు. కానిస్టేబుల్ పట్ల దురుసుగా వ్యవరించిన కిషన్ బాగ్ కార్పొరేటర్ ను ముఖ్యమంత్రి అరెస్ట్ చేయించి జైల్లో పెట్టాలని డిమాండ్ చేస్తున్నాన‌ని రాజాసింగ్ అన్నారు.

BJP MLA Raja singh demands that MIM corporator should arrest

Latest Updates