ఎమ్మెల్యే మంచి మ‌న‌సు : ప్ర‌తి రోజూ వెయ్యి మందికి భోజ‌నం

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మంచి మ‌న‌సు చాటారు. త‌న నియోజకవర్గం గోషామహాల్ లో రోజూ వెయ్యి మందికి అన్న‌దానం చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే రాజాసింగ్ ..పేదల కోసం భోజనం తయారు చేసి పార్సిల్ గా తీసుకెళ్తే బస్తీల్లో వందలాది మంది జనం వస్తు..న్నారన్నారు. త‌నకున్న శక్తి మేరకు రోజుకు ఓ వెయ్యి మందికి భోజనం అందిస్తున్నాన‌ని.. కానీ పబ్లిక్ కు స‌రిపోవ‌డంలేద‌న్నారు. మ‌రింత‌ మంది భోజనం అడుగుతున్నారని తెలిపారు.

ఆదివారం కూడా వెయ్యి మందికి భోజనం పంపిణీ చేశానని.. అయితే రేషన్ షాపులన్ని ఓపెన్ చేసి ప్రజలకు బియ్యం ఇస్తే కొంత ఈ పరిస్థితి తగ్గే అవకాశముందన్నారు. ప్రజలు భోజనం కోసం ఇబ్బందులు పడుతున్నారని.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విషయంపై దృష్టి పెట్టాలని తెలిపారు. వెంటనే అన్ని రేషన్ షాపులు ఓపెన్ చేయాలని చెప్పారు ఎమ్మెల్యే రాజాసింగ్.

Latest Updates