సీపీ సజ్జనార్ కు మరోసారి సవాల్ విసిరిన రాజాసింగ్

హైదరాబాద్: సైబరాబాద్ సీపీ సజ్జనార్ కు మరోసారి సవాల్ విసిరారు BJP ఎమ్మెల్యే రాజాసింగ్. ఐదు రోజుల్లో గోవుల అక్రమ తరలింపును అడ్డుకోకుంటే తానే రంగంలోకి దిగుతానని హెచ్చరించారు. బహుదూర్ పూర PS ముందు ఆవుల తరలిస్తున్న వీడియోలను ఆధారాలతో సహా బయట పెట్టారు. గురువారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. మీకు చేత కాకుంటే అనే పదాన్ని తాను ఉపయోగించవచ్చని… కానీ పోలీస్ కమిషనర్‌పై తనకు గౌరవం ఉందన్నారు. ఇప్పటికైనా చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలన్నారు. రాజకీయ నాయకులపై కామెంట్స్ చేయటం కాదని.. అక్రమంగా గోవులను తరలిస్తోన్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Latest Updates