చిన్న బామ్మర్దికి అపాయింట్‎మెంట్ ఇస్తారు.. కానీ మాకు ఇవ్వరు

V6 Velugu Posted on Sep 23, 2021

సిరిసిల్ల: టీఆర్ఎస్ మేనిఫెస్టోలోని హామీలు అమలు చేయించడమే ప్రజా సంగ్రామ యాత్ర లక్ష్యమని గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. కేసీఆర్, కేటీఆర్ దుకాణం త్వరలోనే బంద్ అవుతుందని... రాబోయే 2 ఏళ్లలో బీజేపీ అధికారంలోకి వస్తోందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొన్న రాజాసింగ్.. గంభీరావుపేటలో పై వ్యాఖ్యలు చేశారు.

‘నీళ్లు నిధులు నియామకాలు అన్నీ ఫాంహౌజ్‎కే వెళుతున్నాయి. నిరుద్యోగులకు రావాల్సిన ఉద్యోగాలు.. కూతురు, కొడుకు, అల్లుడికి వచ్చాయి. హుజురాబాద్‎లో పైసల వర్షం కురుస్తుంది. ఆ డబ్బులన్నీ మన డబ్బులే. లిక్కర్ తాగడం వల్ల తెలంగాణ రాలేదు. యువకుల బలిదానం వల్ల తెలంగాణ వచ్చింది. ల్యాండ్, ఇసుక, డ్రగ్స్, లిక్కర్ మాఫియా చేతుల్లో బంగారు తెలంగాణను మత్తు తెలంగాణగా మార్చారు. కేసులకు బీజేపీ కార్యకర్తలు భయపడరు. బడా నిజాం.. చోటా నిజాం తెలంగాణను పాలిస్తున్నారు. సోషల్ మీడియాలో పాలన సాగిస్తున్న కేటీఆర్.. వైట్ చాలెంజ్ పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. మా చిన్న బామ్మర్దికి అపాయింట్‎మెంట్ ఇస్తారు కానీ, బీజేపీ ఎమ్మెల్యేకు మాత్రం ఇవ్వలేదు. మాకు 5 నిమిషాలు సమయమిస్తే బట్టలిప్పి కొడుతాం’ అని రాజాసింగ్ అన్నారు.

Tagged Bjp, TRS, Bandi Sanjay, Telangana, CM KCR, MLA Raja singh, KTR, Gambhiraopet, Siricilla, Praja Sangrama Yatra

Latest Videos

Subscribe Now

More News