కారు KCR దే కానీ., స్టీరింగ్ మాత్రం MIM ది

అసెంబ్లీలో సమస్యలు చర్చించకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని డ్రామాలే ఆడారన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. సభలో ఏ సమస్య గురించి అడిగిన సమాధానం ఇవ్వకుండా.. కరోనా పేరు చెప్పి సమస్యలు చర్చించకుండా అసెంబ్లీ నుంచి పారిపోయాడన్నారు. మంగళవారం పార్టీ ఆఫీస్ లో మాట్లాడిన రాజా సింగ్..  కారు కేసీఆర్‌దే కానీ, స్టీరింగ్ మాత్రం MIM చేతుల్లో ఉందని అన్నారు. MIM లేవమంటే లేస్తున్నాడని, కూర్చొమ్మని చెబితే కూర్చుంటున్నాడని అన్నారు. అసలు MIM అంటే కేసీఆర్‌కు ఎందుకంత భయమని ప్రశ్నించారు.

సీఎం కేసీఆర్‌ను ఊసరవెల్లితో పోల్చుతూ… రంగుల మార్చడం లో ఆయనకు ఆయనే సాటి అని చెప్పారు.అసెంబ్లీ లో రెండు టీమ్‌లు ఉన్నాయని.. ఒకటి డప్పులు కొట్టే టీమ్..,  మరొకటి ప్రతిపక్ష సభ్యులు మాట్లాడుతుంటే అరిచే టీమ్ అని అన్నారు రాజాసింగ్. ప్రతిపక్ష సభ్యులు మాట్లాడకుండా ఉండేందుకు ఇలా వ్యవరిస్తున్నారన్నారు. సభలో సీఎం అసభ్యకరమైన భాషను మాట్లాడుతున్నారని అన్నారు

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని పథకాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుందని చెప్పిన రాజాసింగ్… ఎన్నికల్లో ఇచ్చిన హామీలను రాష్ట్ర  ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. డబుల్ బెడ్ రూమ్‌ ఇండ్ల నిర్మాణం జరగలేదని, ఈ ఆరేళ్లలో ఎంత మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారని ప్రశ్నించారు. బైంసా లో హిందువుల ఇళ్లు కాల్చివేస్తే…ఇండ్లు కాలిన వాళ్ళ మీదనే కేసులు పెట్టి,  అసలు నిందితులను వదిలేశారన్నారు.

బీజేపీ ఇచ్చిన మాట ప్రకారం CAA తీసుకొచ్చామని చెప్పిన రాజాసింగ్.. CAA ను ఎవరు ఆపలేరన్నారు. CAA వల్ల ఎవరికి ఇబ్బందులు లేవని, 80 వేలు పుస్తకాలు చదివిన కేసీఆర్…CAA  గురించి తెలుసుకునేందుకు 10 పేజీలు చదివితే బాగుండేదని అన్నారు. CAA వల్ల ఎవరికి హాని లేదని, మాయ మాటలు చెప్పి సీఎం ప్రజలను మోసం చేస్తున్నారన్నారు.

ముఖ్యమంత్రిని పుట్టిన తేదీ వివరాలు ఎవరు అడుగుతున్నారని, ఎవరైనా ఉన్నంత వరకు వివరాలు ఇస్తారన్నారు. CAA వల్ల కేసీఆర్‌కు భయమెందుకు? అని ప్రశ్నించారు రాజాసింగ్.  ఆయనది తెలంగాణ కాదనిపిస్తుందన్నారు.

Latest Updates