నాకు తోడుగా రఘునందన్‌ను అసెంబ్లీకి పంపిస్తే అయ్యాకొడుకులను ఓ ఆట ఆడుకుంటాం

అయ్య, కొడుకు, అల్లుడు కలిసి తెలంగాణను నాశనం చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సీఎం కేసీఆర్ కుటుంబం గురించి విమర్శించారు. దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకు మద్దతుగా మున్సిపాలిటీ పరిధిలోని లచ్చపేట వార్డులో ఎమ్మెల్యే రాజాసింగ్, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మినారాయణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాజాసింగ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం, శనివారం అక్కడే ఉండనున్నారు. దుబ్బాకలో జరిగేది ఎన్నికలు కాదని.. ఒక యుద్ధమని ఆయన అన్నారు. ‘రఘునందన్ రావుపై ఎన్ని కుట్రలు చేస్తుండ్రో మీ అందరికీ తెలుసు. కేంద్రం నుంచి ఒక్క రూపాయి రాలేదంటున్నారు కదా.. ఆ మాటపై నిలబడితే మేం రెడీ. ఎక్కడికి రమ్మంటావో చెప్పు. అయ్య, కొడుకు, అల్లుడు కలిసి తెలంగాణను నాశనం చేస్తున్నారు. బంగారు తెలంగాణ కాలేదు కానీ మత్తు తెలంగాణ అయితే అయింది. తెలంగాణ కోసం ఎంతో మంది యువకులు ప్రాణాలు త్యాగం చేసిండ్రు. నాకు తోడుగా రఘునందన్‌ను అసెంబ్లీకి పంపిస్తే అయ్యాకొడుకులను ఓ ఆట ఆడుకుంటాం. మేమిద్దరం కలిసి తెలంగాణలో బీజేపీ జెండా ఎగురవేస్తాం’ అని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు.

For More News..

నేటి నుంచి భారత్‌లో పబ్జీ బంద్

ముగ్గురు బీజేపీ కార్యకర్తలను చంపిన ఉగ్రవాదులు .. సంతాపం తెలిపిన ప్రధాని మోడీ

14 ఏళ్లకే గర్భం.. సీక్రెట్‌గా డెలివరీ.. పేరెంట్స్‌కు భయపడి శిశువును ఫ్రీజర్‌లో దాచిన బాలిక

Latest Updates