చిదంబరంలాగే కేసీఆర్ జైలుకు వెళ్తాడు: రాజాసింగ్

సీఎం కేసీఆర్ కామెంట్స్ పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ బదులిచ్చారు. ఇందుకు ఒక వీడియోను రిలీజ్ చేశారు రాజాసింగ్. తాను దేశ రక్షణ, ధర్మ రక్షణ కోసం ఒక సైన్యాన్ని తయారు చేస్తున్నామన్నారు. ఇందుకు తాను బెంగళూరులో బిజీగా ఉన్నట్లు చెప్పారు. తాను అసెంబ్లీకి రాకపోవడంపై సీఎం కేసీఆర్ ఎద్దేవా చేయడం తగదని అన్నారు. అసెంబ్లీలో కేసీఆర్ పెద్ద పెద్ద బాంబులు వేస్తున్నారని అవి ఒక్కటి కూడా పేలడం లేవని చెప్పారు.

ప్రజలకు ఇచ్చిన హామీలమీద కేసీఆర్ నిలబడ్డాడా అని ప్రశ్నించారు రాజాసింగ్. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆశాబావం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలను మోసం చేసి కేసీఆర్ అధికారంలోకి వచ్చారని అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ప్రజలకు సేవ చేసి చూపిస్తామని చెప్పారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రతీ స్కీంలో స్క్యాం ఉందని అన్నారు.. కేసీఆర్‌కు కూడా చిదంబరం లాగే జైలుకు వెళ్లే పరిస్థితి వస్తదని అన్నారు రాజాసింగ్.

 

Latest Updates